Jio Rockers సమీక్ష : సోగ్గాడే చిన్ని నాయనా – ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Jio Rockers సమీక్ష : సోగ్గాడే చిన్ని నాయనా – ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

విడుదల తేదీ : 15 జనవరి 2016

దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ

నిర్మాత : నాగార్జున

సంగీతం : అనూప్ రూబెన్స్

నటీనటులు : నాగార్జున, లావణ్య త్రిపాటి, రమ్యకృష్ణ ..

అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన ‘మనం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఒకటిన్నర ఏడాది గ్యాప్ తీసుకున్న కింగ్ నాగార్జున నుంచి వస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. మరోసారి నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ చేసిన ఈ సినిమాలో లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా నటించారు. నాగార్జున తన హోం బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణని దర్శకుడిగా పరిచయం చేసాడు. మరి నాగ్ కొత్త డైరెక్టర్ తో చేసిన ఈ ఆత్మకథల మాయాజాలం ఎంతలా ఆడియన్స్ ని మెప్పించింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

గోదావరి జిల్లాలోని శివాపురంలోని వారంతా గొప్పగా చెప్పుకునే వ్యక్తి బంగార్రాజు(నాగార్జున). అమ్మాయిలని మాటలతోనే తన మత్తులో పదేసుకునే సత్తా ఉన్నవాడు బంగార్రాజు. ఓ రోజు యాక్సిడెంట్ లో బంగార్రాజు చనిపోతాడు. బంగార్రాజు భార్య అయిన సత్యభామ(రమ్యకృష్ణ) బంగార్రాజు లా తన కొడుకు రామ్మోహన్(నాగార్జున) పెరగ కూడదని ఊరికి దూరంగా డాక్టర్ చదివిస్తుంది. తనకి సీత(లావణ్య త్రిపాటి)తో పెళ్లి కూడా చేస్తుంది. అమెరికాలో ఉండే వీరిద్దరూ పెళ్ళైన మూడేళ్ళ తర్వాత విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని శివపురంకి వస్తారు.

విడాకుల విషయం విన్న సత్యభామ బంగార్రాజు ఫోటో ముందు తన మొర చెప్పుకుంటుండగా.. పైన యమలోకంలో యముడు(నాగబాబు) ఆ పతివ్రత కోరిక తీర్చాలని అసలు ఎప్పుడూ జరగని రీతిలో యముడు బంగార్రాజు ఆత్మని భూమి మీదకి పంపుతూ, సత్యభామకి మాత్రమే కనిపించే, వినిపించే వరం కూడా ఇస్తాడు. అలా వచ్చిన బంగార్రాజు విడిపోవాలి అనుకున్న రామ్ మోహన్ – సీతలని ఎలా కలిపాడు? ఈ టైంలో బంగార్రాజు తన చావు గురించి తెలుసుకున్న నిజాలేమిటి? అసలెందుకు తను చనిపోవాల్సి వచ్చింది అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

మొదటి నుంచీ అందరూ అనుకుంటూ వచ్చినట్టుగానే… ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కథలోని అన్ని పాత్రలని పరిచయం చేస్తూ ఒక ఫ్యామిలీలోని క్యూట్ లవింగ్ మోమెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన సీన్స్ చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్స్, మిగతా నటీనటులపై మధ్య వచ్చే ప్రతి మోమెంట్ చూడటానికి చాలా అందంగా ఉంటూ, ఎక్కడో ఇప్పుడు మనం మన ఫ్యామిలీలో మిస్ అఅవుతున్న ఫీలింగ్స్ ని చూపిస్తూ ఉండడం వలన చూసే ఆడియన్స్ పెదవులపై చిరునవ్వు ఎక్కడా మిస్ అవ్వదు. మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ లోని సీన్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇలా ఒక మంచి ఫీల్ తో సినిమాని తీసుకెళ్ళి ఓ ట్విస్ట్ తో సెకండాఫ్ పై ఆసక్తిని క్రియేట్ చేస్తాడు. సెకండాఫ్ లో చివర్లో బంగార్రాజు ఎపిసోడ్స్, అతన్ని ఆత్మగా వెనక్కి పంపడానికి గల కారణాలను బాగా చెప్పారు. అలాగే చివర్లో వచ్చే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాని చూసే ఆడియన్స్ ని ఒక్కసారిగా ఉత్తేజ పరిస్తే, చివరి ఎమోషనల్ సీన్ హృదయానికి హత్తుకునేలా ఉంది.

నాగార్జున బంగార్రాజు, రామ్మోహన్ అలియాస్ రాము అనే రెండు విభిన్న పాత్రల్లో అద్భుతమైన నటనని కనబరిచాడు. ఈ రెండు పాత్రలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఆ రెండు పాత్రల్లో నాగ్ చూపిన వైవిధ్యం సూపర్బ్. అంతేకాదు మనకు ఓ సారి ‘హలో బ్రదర్’ సినిమాలోని పాత్రలని గుర్తు చేస్తుంది. బంగార్రాజు పాత్రలో ఆడవారితో తెగ మాటలు కలిపి, ఇట్టే తన వశం చేసుకునే అల్లరి సోగ్గాడి పాత్రలో చాలా బాగా చేసాడు. అంతేకాక బంగార్రాజు పాత్రలో కోనసీమ యాసలో డైలాగ్స్ అదరగొట్టేసాడు. ఇక రాముగా అమాయకమైన పాత్రలో పెదవులపై కంటిన్యూగా నవ్వును జెనరేట్ చేస్తూ ఉంటాడు. ఈ వయసులోనూ నాగ్ లో ఆ చరిష్మా తగ్గలేదు. ఆ మెయిన్టైనెన్స్ కి హ్యాట్సాఫ్. ముగ్గురి కెమిస్ట్రీ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్, అవే.. బంగార్రాజు – రాముల కాంబినేషన్ సీన్స్, నాగ్ – రమ్యకృష్ణల ప్రేమలోని సరసం మరియు సెకండాఫ్ లో నాగ్ – లావణ్యల లవ్ ట్రాక్ లో అమాయకత్వాన్ని మిక్స్ చేసి చేసిన చిలిపితనం.. ఈ మూడు మస్త్ అనిపిస్తాయి. లావణ్య త్రిపాటి శారీల్లో చాలా అందంగా కనిపించడమే కాకుండా తన సింపుల్ క్యూట్ లుక్స్, హావ భావాలతో ఓ మంచి ఫీల్ ని కలిగించింది. ఇక రమ్యకృష్ణ తన పాత్రలో ది బెస్ట్ అనిపించుకుంది. ఇప్పుడు కూడా నాగ్ – రమ్యకృష్ణల పెయిర్ చూడ ముచ్చటగా ఉంది. ఇక సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయిన ముద్దు గుమ్మలు అనసూయ, హంసా నందిని, దీక్ష పంత్ లు ఉన్న సీన్స్ లో మస్త్ అనిపించారు.

ఇక నెగటివ్ షేడ్స్ లో కనిపించిన సంపత్ రాజ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నాజర్, చలపతి రావు, బ్రహ్మజీలు సపోర్టింగ్ రోల్స్ లో మెప్పిస్తే, బ్రహ్మానందం, సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళిలు అక్కడక్కడా కామెడీని పండించారు. సినిమాలో అక్కడక్కడా వాడిన విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సినిమాకి చాలా కీలకమైన యమలోకం సీన్, అందులో యముడిగా నాగబాబు అందరినీ మెప్పిస్టారు. ఆహ్లాదకరంగా సాగిపోయే మొదటి అర్ధభాగానికి, ఓ మలుపుతో కూడిన చివరి 30 నిమిషాల ఎపిసోడ్ తోడవడం వలన సినిమా ముగిసేటప్పటికీ ప్రతి ఒక్కరూ ఓ చక్కని ఫీల్ గుడ్ సినిమా చూసాం అనే ఫీలింగ్ తో బయటకి రావడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. బంగార్రాజు గర్ల్ ఫ్రెండ్ కృష్ణకుమారి పాత్రలో అనుష్క అతిధి పాత్ర అందరికీ ఓ చిన్న సర్ప్రైజ్..

మైనస్ పాయింట్స్ :

సినిమా పరంగా ఓ మంచి ఫీల్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి.. అవేమిటంటే.. ఫస్ట్ హాఫ్ మొత్తంలో కథలోకి ఎంటర్ అవ్వకుండా కేవలం సినిమాలోని పాత్రలని, ఆ పాత్రల స్వభావాలని మాత్రమే చెప్తూ ఫస్ట్ హాఫ్ ని ఫినిష్ చేస్తారు. దానివలన చూసే ఆడియన్స్ కి సీన్స్ వల్ల మంచి ఫీలున్నా ఇంటర్వెల్ టైంకి ఇంతసేపు అసలు కథలోనే ఎంటర్ అవ్వలేదేంటి అనే భావనకి లోనవుతారు. దానివలన కొంతమంది ఆ లవ్ సీన్స్ ఒక స్టేజ్ తర్వాత బోర్ కొట్టవచ్చు. ఇక సెకండాఫ్ లో చేసిన మిస్టేక్ ఏంటంటే.. కథలో ఉన్న కంటెంట్ మరియు ఒక్కగానొక్క ట్విస్ట్ ని సెకండాఫ్ చివరి 30 నిమిషాల్లో చెప్పడం. ఆ కారణంగా సెకండాఫ్ మొదటి 30 నిమిషాలలో పెద్ద కిక్ ఉండదు. అంతే కాక అదే రొమాంటిక్ సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. దాని వలన ఆ 30 నిమషాలు హ్కాలా బోరింగ్ గా అనిపిస్తుంది.

వీటితో పాటు మేజర్ మైనస్.. చాలా అంటే చాలా సింపుల్ స్టొరీ లైన్ ని ఎంచుకోవడం. సినిమాలో ఉన్న మేజర్ ట్విస్ట్ ఒక్కటే.. ఆ ఒక్క ట్విస్ట్ ని ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా రాసుకోలేకపోయారు. అలాగే ఆ ట్విస్ట్ రివీల్ అవ్వగానే సినిమా ఏంటనేది అందరికీ తెలిసిపోతుంది. అలాగే సూపర్ నాచురల్ పవర్స్ ని వాడుకొని రాసుకున్న ప్రీ క్లైమాక్స్ సీన్ ఇంకాస్త బాగుండాల్సింది. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే ఎఫ్ఫెక్టివ్ గా లేకపోవడం వలన చాలా చోట్ల బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే నాగార్జున – లావణ్య త్రిపాటి లవ్ స్టొరీ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

నిర్మాత పి. రామ్ మోహన్ ఒరిజినల్ స్టొరీ లైన్ ని అందించాడు. సత్యానంద్ కథనాన్ని అందిస్తే, కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి రచన-దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. కొత్తవాడైనప్పటికీ ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ డ్రామాకి సూపర్ నాచురల్ పవర్స్ ని జోడించి కథని బాగా రాసుకున్నాడు. రామ్ మోహన్ ఇచ్చిన సింపుల్ స్టొరీ లైన్ ని కళ్యాణ్ కృష్ణ చాలా బాగా డెవలప్ చేసుకున్నాడని చెప్పాలి. ఆ కథని స్క్రీన్ ప్లే లో ప్రెజంట్ చేస్తున్నప్పుడు సత్యానంద్ కాస్త బెటర్ మెంట్ చేయాల్సింది కానీ చేయలేదు. ఎలా అంటే సినిమాలో ఉన్నదే ఒక్క ట్విస్ట్.. అలాంటప్పుడు స్క్రీన్ ప్లేలో సాగదీత సీన్స్ లేకుండా చూడాల్సింది. కానీ అయన ఆ పని చేయలేదు అందుకే కొంత బోరింగ్ గా ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ రాసుకున్న డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా బంగార్రాజు పాత్రకి రాసిన కోనసీమ డైలాగ్స్ బాగా ఫేమస్ అవుతాయి. ఇక కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా మంచి మార్కులే కొట్టేసాడు. కొన్ని సన్నివేశాలను ఎఫ్ఫెక్టివ్ గా తీయలేకపోయినా మిగతా అన్ని సీన్స్ ని చాలా బాగా తీసాడు. మొదటి సినిమాకి రచన – దర్శకత్వం పరంగా కళ్యాణ్ కృష్ణకి మంచి మార్కులు పడతాయి. ఉన్న బడ్జెట్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.

పిఎస్ వినోద్ – సిద్దార్థ్ లు కలిసి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. ప్రతి సీన్ అందంగా క్యూట్ గా ఉంటుంది, ఆ సీన్స్ ని తన విజువల్స్ తో ఒక అందమైన అనుభూతిగా మార్చేశాడు. ఇక అనూప్ రూబెన్స్ అందించిన మెలోడీస్ సూపర్బ్ అయితే ఆ పాటలని ఎక్కువభాగం సీన్స్ తో షూట్ చేసిన విధానం సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్. అలాగే నేపధ్య సంగీతం సినిమాకి మరో ప్రధాన హైలైట్. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ డిజైన్ చేసిన సెట్స్, విలేజ్ హౌస్ మరియు యమలోకం సెట్ చాలా బాగున్నాయి. ప్రవీణ్ పూడి చాలా వరకూ క్రిస్ప్ ఎడిటింగ్ ఉండేలా చూసుకోవాల్సింది, అలా చూసుకోకపోవడం వలన 70% ఓకే అనిపిస్తే, 30% బాడ్ ఎడిటింగ్ అనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

‘వాసి వాడి తస్సాదియ్యా’.. నాగార్జున ఆడియో లాంచ్ లో చెప్పినట్టుగానే కొట్టాడుగా.. అదేనండి ‘హిట్టు’ కొట్టాడుగా అంటున్నా.. ‘మనం’ తర్వాత నాగ్ మరోసారి కంప్లీట్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ స్టొరీతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ రూపంలో తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించాడు. ఫ్యామిలీ స్టొరీకి సూపర్ నాచురల్ పవర్స్ ని మిక్స్ చేసిన విధానం బాగుంది. ద్విపాత్రాభినయంలో నాగార్జున అద్భుత నటన, లీడ్ హీరోయిన్స్ క్యూట్ లుక్స్ అండ్ వారితో నాగ్ కెమిస్ట్రీ, చివరిదాకా దాచిన సస్పెన్స్, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. అక్కడక్కడా డ్రాగ్ అవ్వడం, సెకండాఫ్ మొదటి 30 నిమిషాలు రొటీన్ అనిపించడం, సింపిల్ స్టొరీ లైన్, బాగుండాల్సిన కథనం చెప్పదగిన మైనస్. నాగ్ ఫాన్స్ కి బాగా అంటే బాగా నచ్చే సినిమా. ఫైనల్ గా తెలుగు వారికి అత్యంత ప్రియమైన ఈ సంక్రాంతి సీజన్ లో అత్యంత ఆప్తులైన తమ కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’.

Jio Rockers