Jio Rockers సుడిగాడు – టాలీవుడ్ సూపర్బ్ స్పూఫ్ ఎంటర్టైనర్

కామెడీ కింగ్ అల్లరి నరేష్ మరియు మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘సుడిగాడు’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్ తన సినిమాల్లో అడపా దడపా పెద్ద హీరోలను అనుకరించినా పూర్తి పేరడీ సినిమా చెయ్యలేదు. ఆ లోటుని ఈ చిత్రంతో భర్తీ చేసారు, ఈ చిత్రంలో సుమారు టాలీవుడ్ టాప్ 100 సినిమాల్లోని సన్నివేషాలను తీసుకొని పేరడీ చేసారు. భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ డి.రెడ్డి నిర్మించారు. విడుదలకి ముందే సరికొత్త రకమైన స్పూఫ్ పోస్టర్లతో మరియు ట్రైలర్ల తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలను మరియు ఆసక్తిని పెంచేసారు. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ‘సుడిగాడు’ చిత్రం కమర్షియల్ గా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ సుడి ఎంత వరకు తిప్పిందో ఇప్పుడు చూద్దాం….

కథ :

కామేష్(అల్లరి నరేష్) మరియు అతని భార్య (హేమ)కి పుట్టుకతోనే సిక్స్ ప్యాక్ కలిగిన ఒక డైనమిక్ మరియు పవర్ఫుల్ కొడుకు పుడతాడు. ఆ బాలుడుకి తిక్కల్ రెడ్డి (జయప్రకాశ్ రెడ్డి)అనే విలన్ వల్ల ఆపద ఉందని తెలిసి, కామేష్ తన తల్లి(కోవై సరళ) కి ఇచ్చి ఆ బాలుడిని ఊరు దాటిస్తాడు. అలా హైదరాబాద్ కి వచ్చిన శివ (అల్లరి నరేష్) ఒక తెలుగు సినిమా హీరోలా డేర్ మరియు డాషింగ్ గల కుర్రాడిగా ఎదుగుతాడు.

శివ లోని వేగాన్ని చూసి పోసాని కృష్ణమురళి ఎంతో తెలివిగా శివాని పందెంలోకి దింపుతాడు. అలాగే మరో పక్క శివ ప్రియ (మోనాల్ గజ్జర్) ప్రేమలో పడతాడు. తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతూ ఉంటారు, అది తెలుసుకున్న శివ వారితో పోరాడాలని నిర్ణయించుకుంటాడు, మధ్యలో ఎవరూ ఊహించని విధంగా డాన్ డి కూడా శివ పై దాడి చేస్తాడు. డాన్ డి ఎందుకు శివ పై దాడి చేసాడు? వారందరితో శివ పోరాడి తన ప్రేమని ఎలా గెలుచుకున్నాడు? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

అల్లరి నరేష్ శివ పాత్రలో అద్భుతంగా నటించారు. తన కామెడీ టైమింగ్ తో మరియు పంచ్ డైలాగులతో సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆద్యంతం నవ్వించాడు. నరేష్ తన కెరీర్లోనే అత్యుత్తమమైన నటనను ఈ చిత్రంలో ప్రదర్శించారు. మోనాల్ గజ్జర్ కూడా బాగా నటించింది.

జయప్రకాశ్ రెడ్డి, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్ మరియు ఎం.ఎస్ నారాయణ నటన చాలా బాగుంది మరియు వారి గెటప్పులతో కూడా ప్రేక్షకులను బాగా నవ్వించారు. జెఫ్ఫా రెడ్డి పాత్రలో బ్రహ్మానందం బాగా నవ్వించారు. హేమ మరియు కోవై సరళ తమ పరిధి మేర నటించాగా శ్రీనివాస రెడ్డి ఖలేజాలోని సిద్ద పాత్రకి పేరడీగా రూపొందించిన పాత్రలో బాగా నవ్వించారు. ఫిష్ వెంకట్ మరియు రఘుబాబు ఒక మాదిరిగా నవ్వించారు.

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సూపర్ హిట్ సినిమాల్లోని సన్నివేశాలను అందరూ మెచ్చుకునేలా పేరడీ చేయడం ఈ చిత్రం యొక్క ప్రధాన హైలైట్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఏ ఒక్క పేరడీ సన్నివేశం కూడా ఎవ్వరినీ కించపరిచేలా లేకుండా అందరినీ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. అలాగే సినిమాలో ముఖ్యంగా రెండు పేరడీ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. అందులో ఒకటి టీవీ యాంకర్ ఓంకార్ మీద తీసిన పేరడీ మరియు తొడ కొట్టడం అనే కాన్సెప్ట్ మరొకటి. ముఖ్యంగా ఓంకార్ మీద చేసిన పేరడీ సన్నివేశానికి ప్రేక్షకులు పడీ పడీ నవ్వుతారు. ఆ సన్నివేశాల్లో పోసాని కృష్ణ మురళి కూడా బాగా నవ్వించారు.

మొత్తం సినిమా వేగంగా ముందుకెలుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం మంచి కామెడీతో ఎంతో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు. కామెడీ సినిమా తీయడంలో భీమనేని శ్రీనివాస్ రావు పూర్తిగా సక్సెస్ అయ్యారు.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రం క్లైమాక్స్ కి వచ్చే సరికి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బాగా హైలైట్ కావాల్సిన ఒక సన్నివేశంలో కామెడీ కొంచెం తగ్గింది. కోర్ట్ ఎపిసోడ్ సన్నివేశాలని ఇంకొంచెం బాగా తీసి ఉంటే బాగుండేది. అలాగే ఈ చిత్రం చివరిలో వచ్చే ట్విస్ట్ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. మొదటి నుంచి ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగినా క్లైమాక్స్ మాత్రం నన్ను కాస్త నిరాశ పరిచింది.

ఈ చిత్రానికి పాటలు మరొక మైనస్ గా చెప్పుకోవాలి. సినిమాలో ఒక్క మొదటి పాట తప్ప మిగాతా అన్ని పాటలు అంత ఎంటర్టైనింగ్ గా లేకపోగా కథలో స్పీడ్ బ్రేకర్ల లాగా అడ్డుపడతాయి. అల్లరి నరేష్ మరియు మోనాల్ గజ్జర్ మధ్య రొమాంటిక్ ట్రాక్ ఇంకా బాగుంటే బాగుండేది. రెండవ అర్ధ భాగంలో ముఖ్యంగా క్లైమాక్స్ చాలా నిదానంగా ఉంటుంది. కొండవలస మరియు ఎల్.బి శ్రీ రామ్ పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ చిత్రానికి డైలాగ్స్ ప్రధాన హైలైట్ గా చెప్పుకోవాలి. ప్రతి డైలాగ్ ని ఎంతో ఎంటర్టైనింగ్ గా రాసారు. శ్రీ వసంత్ అందించిన సంగీతం పరవాలేదనిపించగా, ఎడిటింగ్ బాగుంది కానీ రెండవ అర్ధ భాగంలో ఇంకొంచం శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది.

ఒక పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తీయడంలో భీమనేని శ్రీనివాస్ రావు సక్సెస్ అయ్యారు. ఒక్క క్లైమాక్స్ మీద కొంచెం శ్రద్ధ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

సుడిగాడు మూవీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్. పేరడీ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు, ముఖ్యంగా పైన చెప్పిన ఓంకార్ సన్నివేశాన్ని మాత్రం మిస్ అవ్వొద్దు. ఈ చిత్రం ద్వారా అల్లరి నరేష్ కామెడీ కింగ్ అని మరోసారి నిరూపించుకున్నాడు.ఒక్క క్లైమాక్స్ కొంచెం తగ్గినట్టు అనిపించినా మొత్తంగా సూపర్బ్ ఎంటర్టైనర్. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోని ఫేమస్ సినిమాల పేరడీతో వచ్చిన ‘సుడిగాడు’ చిత్రం చూసినంత సేపు నవ్వుతూనే ఉంటారు. ఈ వారాంతంలో చూడదగిన మంచి సినిమా, ఎట్టి పరిస్తితుల్లోనూ మిస్ అవ్వొద్దు.

Jio Rockers