Jio Rockers సమీక్ష : ఆకాశంలో సగం – సగం కాదు ఫుల్ టార్చర్..

తెలుగు ఫేమస్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘అనైతికం’ అనే నవలా ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఆకాశంలో సగం’. ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగు ఇండస్ట్రీలోని 18 మంది దర్శకులు తెరపై కనిపించడం విశేషం. ఫ్లోరా షైనీ, రవిబాబు, చంద్ర సిద్దార్థ్, శేతాబాసు ప్రసాద్ కీలక పాత్రాల్లో నటించిన ఈ సినిమాకి యండమూరి పూర్తి కథాసహకారం అందించగా, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు. గతంలో యండమూరి రాసిన కొన్ని నవలలను సినిమాలుగా తీసారు. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి, మరి ‘ఆకాశంలో సగం’ కూడా సినిమాల్లాగానే హిట్ అందుకేనే రేంజ్ లో ఉందో, లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

‘పవిత్రాయ సాధునాం’ అనే శ్లోకం తో సినిమా మొదలవుతుంది. వసుంధర(ఫ్లోరా షైనీ) టీచర్ గా పనిచేస్తూ తన కూతురు సవేరి(శ్వేత బసు ప్రసాద్)తో కలిసి జీవనం సాగిస్తుంటుంది. సవేరి ప్రేమించుకున్న తన ఇద్దరి ఫ్రెండ్స్ ని కలపడం కోసం ఓ రిస్క్ చేస్తుంది. దాంతో వసుంధర, సవేరి పోలీసుల ముందు అవమానం ఎదుర్కొంటారు. దానికి బాగా బాధపడ్డ సవేరి తన తల్లి గతం ఏంటి? తన తండ్రి ఎవరు? అని నిలదీస్తుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబంలో చిన్నోడైన గిరిధర్(చంద్ర సిద్దార్థ్) భార్య వసుంధర, అదే ఇంట్లోనే పెద్దోడు రవిబాబు(రవిబాబు) కూడా ఉంటాడు. గిరిధర్ తన భార్య వసుంధరని ఏ విషయంలోనూ మెచ్చుకోడు. కానీ అదే తరుణంలో రవిబాబు వసుంధరలోని టాలెంట్ చూసి అభినందిస్తాడు. దాంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ సాన్నిహిత్యం ఎంతవరకూ దారి తీసింది? దాని వల్ల వసుంధర ఎదుర్కొన్న సమస్యలేమిటి? అసలు వసుంధర ఎందుకు భర్తని, ఫ్యామిలీని వదిలేసి ముంబైలో జీవనం సాగిస్తోంది? అనే అంశాలను తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో కీలక పాత్ర పోషించిన ఫ్లోరా షైనీ పాత్రకి బాగానే న్యాయం చేసింది. అలాగే ఓ రెండు పాటల్లో తన అందాలను ఆరబోసి గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. రవి బాబు పాత్రకి తగ్గట్టు చేసారు. పోసాని కృష్ణ మురళి ఇన్స్ పెక్టర్ పాత్రలో బాగానే నటించాడు. శ్వేతబసు ప్రసాద్ నటన పరవాలేదు. భజన్ లాల్ పాత్రలో కాశీ విశ్వనాథ్ బాగా సరిపోయాడు.

మైనస్ పాయింట్స్ :

నవలా ఆధారంగా సినిమాలను తెరకేక్కించాలంటే అంత సులువైన విషయం కాదు, అందులో కాన్సెప్ట్ ని తీసుకొని దానికి సినిమా పరంగా కొన్ని రంగుల్ని అద్దాలి, మనోళ్ళు అద్దారు గ్లామర్, సాంగ్స్ అని కానీ అవి సినిమా పోస్టర్స్ లో వేసుకోవడానికి తప్ప ఇంకదేనికీ ఉపయోగపడలేదు. ఈ సినిమా స్టార్టింగ్ కార్డు నుంచి శుభం కార్డ్ వరకు ఏదో ఓ 9 నెలల గర్భవతి నడవలేక నడిచినట్లు, ఓ 100 ఏళ్ళ ముసలి వాళ్ళు కర్ర పట్టుకొని నడిచినట్టు చాలా ఎంత వీలైతే అంత నెమ్మదిగా సాగేలా డైరెక్టర్ ప్లాన్ చేసుకున్నాడు. ఏమో ఫాస్ట్ గా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకుంటే జనాలకి అర్థం కాదనుకున్నాడేమో డైరెక్టర్. నటీనటుల విషయంలో చాలా వరకు దర్శకుల్నే డైరెక్టర్ ఎందుకు తీసుకున్నాడు. అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించిన చంద్ర సిద్దార్థ్ నటన సినిమాకి పెద్ద మైనస్. కొన్ని కొన్ని సీన్స్ లో ఆయన నటనకి, డైలాగ్ డెలివరీకి పెద్దగా పొంతన కురదలేదు. ఆయన పాత్ర జనాలకు అస్సలు ఎక్కదు.

బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటల్ని పక్కన పెడితే సినిమాలో వచ్చే రెండు పాటలు అవసరం లేదు సినిమాలో పాటలు ఉండాలి కాబట్టి ఉన్నట్టు ఉంటాయి. ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ని చాలా వరకు ఇటీవలే వచ్చిన ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు సినిమా’లో చూపించేశారు. సినిమాలో ఆడియన్స్ కి కావాల్సిన కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ లాంటివి ఏమీ లేవు. డైరెక్టర్ చెప్పాలనుకున్న ఓ చిన్న మెసేజ్ ని చెప్పడం కోసం ఆడియన్స్ ని రెండు గంటల పాటు కూర్చో మంటే ఎలా కూర్చుంటారు మీరే చెప్పండి. ఈ సినిమాలో చూపించిన మహిళ సమస్య ఒక విధంగా కరెక్ట్ కావచ్చు కాని దాన్ని ఇలా చెప్పకూడదు. ఎందుకంటే ఇలా చేసి చూపడం వల్ల ఉమ్మడి కుటుంబాల్లో, రిలేషన్స్ మధ్య మానవతా సంబందాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది అలాగే ఇలాంటి వాటికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్న యువత పూర్తిగా పెడదారి పట్టే అవకాశం ఉంది.

స్క్రీన్ ప్లే చాలా వీక్ ఎంత వీక్ అంటే పోస్టర్లు లేదా ట్రైలర్స్ చూసిన ఎవరన్నా సినిమాలో ఉన్న ఒక్కగానొక్క ట్విస్ట్ ఏంటనేది ఊహించవచ్చు, క్లైమాక్స్ ఎలా ఉంటుందో అనే విషయాలను సులువుగా చెప్పేయొచ్చు. ఈ సినిమాకి ఆకాశంలో సగం అనే టైటిల్ అస్సలు కుదరలేదు.

సాంకేతిక విభాగం :

రోబో సినిమాలో రజినీ కాంత్ చెప్పినట్టు ఈ సృష్టిలో పనికొచ్చేవి రెండే రెండు ఒకటి నువ్వు రెండు నేను.. అలాగే ఈ సినిమాకి సంబంధించి సాంకేతిక విభాగంలో చెప్పుకోవాల్సినవి రెండే రెండు ఒకటి కళ్యాణ్ సమి సినిమాటోగ్రఫీ, రెండు యశోకృష్ణ మ్యూజిక్. యండమూరి వీరేంద్రనాథ్ కథ ప్రేక్షకులని ఆకట్టుకునే రీతిలో లేదు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ కూడా కాన్సెప్ట్ ని ఎలివేట్ చెయ్యలేకపోయాయి. ఇక ఎడిటర్ బొత్తిగా కత్తెరకి పనిచేప్పినట్టు లేడు. అందుకే సినిమా చాలా నీరసంగా, బోరింగ్ గా ఉంటుంది.

ఇక ప్రేమ్ రాజ్ డీల్ చేసిన విషయానికొస్తే స్క్రీన్ ప్లే చాలా చాలా వీక్, పెద్ద సస్పెన్స్ ఏమీ ఉండదు. దర్శకత్వం అంటారా కొన్ని సీన్స్ బాగా తీసినా కొన్ని సీన్స్ లో మాత్రం నటీనటుల నటనలో జీవం తేకపోవడం వల్ల పేలవంగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి.

తీర్పు :

‘ఆకాశంలో సగం’ సినిమా పరమ బోరింగు సినిమా. టైటిల్ లో సగం అనే పదాన్ని వాడారు సినిమాలో కనీసం సగం అన్నా బాగుంటే బాగుండేది. సినిమాలో చెప్పడానికి ఉన్నది సినిమాటోగ్రఫీ, ఫ్లోరా షైనీ గ్లామర్ అయితే మిగతా అన్నీ..అంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కామెడీ లేకపోవడం, స్లోగా ఉండడం ఇలా అన్నీ మైనస్ లే అవుతాయి. మీరు ఈ సినిమా చూడటం కంటే యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘అనైతికం’ అనే నవల తెచ్చుకొని చదువు కోవడం బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే సినిమా కన్నా ఆ నవల ఆసక్తి కరంగా ఉండొచ్చు.

Jio Rockers