Jio Rockers యుగాంతం – యుగానికి ఒక్క ప్రేమికుడు

దాదాపు పదేళ్ళ క్రితం వచ్చిన ‘ఆనందం’ అనే సినిమా గుర్తుందా? అందులో హీరోగా చేసిన ఆకాష్ గుర్తున్నాడా? ఆ సినిమా తప్ప తరువాత ఆయన చేసిన సినిమాలేవీ హిట్ కాదు కదా కనీసం అసలు ఆయన సినిమాలు చేస్తున్నాడని కూడా చాలా మందికి తెలియదు. సినిమాలు చేయడం మానేసాడు అనుకుంటున్నారు. కానీ జనాలకి తెలియకుండా సిన్సియర్ గా సినిమా మీద తన ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఆకాష్ చేస్తున్న ప్రయోగాల్లో లేటెస్ట్ ప్రయోగం ‘యుగానికి ఒక్క ప్రేమికుడు’ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమాని ప్రయోగం అని ఎందుకన్నానంటే ఈ సినిమాకి డైరెక్టర్ ఆయనే. ఇంక ఈ సినిమా ఎలా ఉందంటే …

కథ :
గౌతమ్ (ఆకాష్) మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్ కానీ ఆటో నడుపుతుంటాడు. (మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్ ఆటో నడపడం ఏంటి అనే అనుమానం మీకు రావచ్చు. హీరో ఫ్రెండ్స్ ఆటో డ్రైవర్స్ కదా అందుకని హీరో కూడా వాళ్ళ కోసం ఆటో డ్రైవర్ అయ్యాడు అనుకుని అడ్జస్ట్ అయిపోవాల్సిందే). అతనుండే అపార్ట్ మెంట్లో ఉండే దివ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నువ్వు ఆటో డ్రైవర్ కదా నన్నెలా పోషిస్తావు, నాకు డబ్బున్న వాడే కావాలి నిన్ను ప్రేమించలేనని దివ్య అంటుంది. తనతో కలిసి చదువుకునే డబ్బున్న అబ్బాయిలతో చనువుగా ఉంటుంది. కట్ చేస్తే గౌతమ్ అక్కడ ఉండలేక తన స్నేహితుడు వినోద్ ఊరికి వెళ్తాడు. అక్కడ ఒక రైస్ మిల్లులో పనికి చేరతాడు. ఆ రైస్ మిల్ ఓనర్ చెల్లెలు ఐశ్వర్య (శ్వేత బసు ప్రసాద్) గౌతమ్ ని ప్రేమిస్తుంది. గౌతమ్ ఆమె ప్రేమని నిరాకరిస్తే చనిపోవాలనుకుంటుంది. అప్పడు గౌతమ్ గతం తెలుసుకుని అతనిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అంటుంది. ఇంతకు గౌతమ్ గతం ఏంటి?

ప్లస్ పాయింట్స్ :
ఎంత వెతికినా ఒక్కటి కూడా దొరకలేదు.

మైనస్ పాయింట్స్ :
ఆనందం, పిలిస్తే పలుకుతా, ఆనందమానందమాయే సినిమాల వరకు చెప్పుకోతగ్గ సినిమాలు తీసిన ఆకాష్ మెల్లిమెల్లిగా బి గ్రేడ్ స్థాయి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా నవ వసంతం ఫేం షాజహాన్ దర్శకుడిగా అనుకుని సినిమా స్టార్ట్ చేసారు. తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ డైరెక్టర్ ప్లేసులోకి ఆకాష్ వచ్చాడు. హీరో, డైరెక్టర్ తనే కాబట్టి ఆట నాదే వేట నాదే అన్నట్లు ఒక ఆట ఆడుకున్నాడు. స్టొరీ కూడా ఆయనే రాసుకున్నాడు. అది కూడా తమిళ్లో వచ్చిన మల్లిగాడు సినిమా నుండి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. నాలుగు సినిమాలు చేయగానే మనం కూడా డైరెక్షన్ చేయోచ్చనే భావన ఈ మధ్య అందరికీ కామన్ ఐపోయింది. డైరెక్షన్ చేయాలనుకోవడం గురించి తప్పుబట్టట్లేదు. కానీ హీరోగానే ఇంకా నిలదొక్కుకోలేదు, డైరెక్షన్లో కనీసం ఏబీసీడీలు కూడా రావు. అలాంటప్పుడు ఎందుకు మనకు రాని పని చేయడం. సినిమా ఎలా తీయకూడదు అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. డైరెక్షన్ కోర్స్ నేర్చుకునే విద్యార్ధులకి ఈ సినిమా చూపించి డైరెక్షన్ ఇలా అస్సలు చేయకూడదు అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా సినిమా మొత్తం చూసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే సినిమా మధ్యలోనే టార్చర్ భరించలేక మీ కోర్స్ వద్దు మీరు వద్దు అని పారిపోతారు. ఇంక ఈ సెక్షన్ ఇంతటితో ఆపడం బెటర్ ఏమో అడిషనల్ షీట్స్ పట్టేలా ఉంది.

సాంకేతిక విభాగం :
ఈ రోజుల్లో ఏ చిన్నా చిన్నాచితకా సినిమాలు కూడా మినిమమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. కనీసం బి గ్రేడ్ సినిమాలు కూడా ఇంత కంటే బెటర్ క్వాలిటీ ఉంటాయి. జాక్సి జాన్ సినిమాటోగ్రఫీ అయితే మలయాళం సి గ్రేడ్ సినిమాల స్థాయిలో ఉంది. గంజాయి వనంలో తులసి మొక్క లాగా కార్తీక్ రాజా మ్యూజిక్ ఒక్కటే కొంతలో కొంత బెటర్. సినిమా స్టార్ట్ అయినపుడు ఉన్న నిర్మాత సినిమా రిలీజ్ టైంకి మారిపోయాడు. కనీసం సినిమాకి డీటీఎస్, డిఐ వర్క్ చేయించలేదు.

తీర్పు :
ఈ సినిమా రిలీజ్ అయిందని కూడా చాలా మందికి తెలియదు. హైదరాబాద్ లాంటి మహా నగరంలోనే ఒక్క థియేటర్లో మాత్రమే విడుదలైంది. థియేటర్ వరకు వెళ్లి చూసేంత మేటర్ సినిమాలో ఏమీ లేదు . మీరు ఆకాష్ ఫ్యాన్ అయితే మాత్రం మొహమాటం లేకుండా వెళ్లి చూడండి. ఇలాంటి సినిమాలు యుగానికి ఒక్కసారే వస్తుంటాయి మరి.

Jio Rockers