Jio Rockers సమీక్ష : టిప్పు – తీయలేక ఫెయిల్ అయిన కథ.!

Jio Rockers సమీక్ష : టిప్పు – తీయలేక ఫెయిల్ అయిన కథ.!

విడుదల తేదీ : 19 జూన్ 2015

దర్శకత్వం : జగదీష్ దానేటి

నిర్మాత : డివి సీతారామరాజు

సంగీతం : మణిశర్మ

నటీనటులు : సత్య కార్తీక్, కనిక కపూర్, పమేలా..

గతంలో ఎన్నో తెలుగు సూపర్ హిట్ సినిమాలకు పంపిణిదారుడిగా పనిచేసిన డి.వి. సీతారామరాజు తన కుమారుడు సత్య కార్తీక్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన సినిమా ‘టిప్పు’. కనికా కపూర్, ఫమేలా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ద్వారా జగదీష్ దానేటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సత్య కార్తీక్ ఏ మేరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో చూద్దాం..

కథ :

మైసూర్ ప్రాంతంలోని శ్రీరంగ పట్నంలో తరాలు మారినా రాజరికం మాత్రమ్మ్ అంతరించాడు. అలనాటి రాజుల వారసులైన హరి భాయ్ (ముక్తా ఖాన్)- కేషు భాయ్(శ్రవణ్) లు అక్కడి ప్రజల్ని పట్టి పీడిస్తుంటారు. దొరికింది దోచుకోవడం, నచ్చిన అమ్మాయిని రెప చేయడం, ప్రజల్ని చంపేయడం లాంటి అరాచకాలు ఎన్నో చేస్తుంటారు. ఇదిలా ఉండగా మన హీరో కార్తీక్ కృష్ణ(సత్య కార్తీక్) మైసూర్ లో ఎంటర్ అవ్వడమే కాకుండా కొంతమంది రౌడీలు కేషు భాయ్ ని చంపబోతుంటే అతన్ని కాపాడతాడు. కట్ చేస్తే కేసు భాయ్ మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న వైష్ణవి(కనిక కపూర్)ని చూసి కార్తీక్ ప్రేమలో పడతాడు. తనని ఇంప్రెస్ చెయ్యడం కోసం తన కాలేజ్ లో చేరి ఫైనల్ గా వైష్ణవి తనని ప్రేమించేలా చేస్తాడు.

ఈ విషయం తెలిసిన శేషు భాయ్ కార్తీక్ ని చంపేయాలని వస్తాడు, కానీ తన ప్రాణాలు కాపాడిన వాడని ఆగుతాడు. కానీ అక్కడే మన హీరో చిన్న ట్విస్ట్ ఇచ్చి రివర్స్ లో శేషు భాయ్ ని చంపేస్తాడు. దాంతో హరి భాయ్ కార్తీక్ ని చంపేయాలనుకుంటాడు.. మరి హరి భాయ్ కార్తీక్ ని చంపాడా.? లేదా.? అసలు కార్తీక్ ఎవరు.? ఎక్కడి నుంచో సడన్ గా మైసూర్ ఎందుకు వచ్చాడు.? శేషు భాయ్ ని మొదట కాపాడి మళ్ళీ తనే ఎందుకు చంపేసాడు.? అసలు కార్తీక్ ఇదంతా ఎందుకు చేసాడు.? తన వెనకున్న గతం ఏంటి.? అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

‘టిప్పు’ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాల్సింది కథనం.. సినిమా కోసం రాసుకున్న కథ రెగ్యులర్ స్టోరీనే అయినా కథ కోసం ఎంచుకున్న నేపధ్యం, ఫస్ట్ హాఫ్ లో కథనంలో రాసుకున్న సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా డీల్ చేసాడు. ఆడియన్స్ కి ఎక్కడ బోర్ లేకుండా హీరోయిన్ బాగానే కథలోకి తీసుకెళ్ళాడు. అలాగే హీరోయిజంని కూడా స్టెప్ బై స్టెప్ బాగా ఎలివేట్ చేసాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా డీసెంట్ గా ఉంది.

ఇక సినిమా హీరో విషయాని వస్తే.. కురాడు చూడటానికి ఒడ్డూ పొడుగు బాగున్నాడు. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజన్స్, సీన్ కి తగ్గా మానరిజమ్స్ ని చూపించడంలో ఫస్ట్ సినిమా అయినా చాలా మెచ్యూరిటీ చూపించాడు. మొదటి సినిమా అయినా ఓ కమర్షియల్ సినిమాని మొత్తం తనపై వేసుకొని పర్ఫెక్ట్ గా నడిపించాడు. కాస్త కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే పమేలా ఉన్నది కొద్దిసేపైనా బాగా చేసింది. ఇకపోతే కనిక కపూర్ జస్ట్ ఓకే. ఫస్ట్ హాఫ్ లో పోసాని కృష్ణమురళి నవ్విస్తే, సెకండాఫ్ లో తెలుగు పవర్ఫుల్ డైలాగ్స్ స్పూఫ్స్ తో ఎంఎస్ నారాయణ – సన ట్రాక్ నవ్వించింది. విలన్స్ గా ముక్త ఖాన్, శ్రవణ్ బాగా చేసారు.

మైనస్ పాయింట్స్ :

అందరూ సర్ప్రైజ్ అయ్యేలా ఫస్ట్ చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. సెకండాఫ్ స్టార్టింగ్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాతే సినిమాని పూర్తిగా చెడగోట్టేసారు. చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత దిరక్టర్ దగ్గర చెప్పడానికి ఏమీ లేదు డైరెక్ట్ గా క్లైమాక్స్ కి వెళ్లిపోవాలి కానీ అలా చెబితే కమర్షియల్ యాంగిల్ మిస్ అవుతుందని అక్కడ కొన్ని కామెడీ ట్రాక్స్ పెట్టి ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఫీల్ ని చెడగోట్టేసారు. ఎంఎస్ నారాయణ – సన ట్రాక్ మొదట్లో బాగానే ఉన్నా మరీ సాగదీస్యడం వల్ల కాస్త బోర్ కొడుతుంది. ఇకపోతే కనిక కపూర్ సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. ఇంకాస్త బెటర్ హీరోయిన్ ని తీసుకొని ఉండాల్సింది.

ఇక కమర్షియాలిటీ కోసం పెట్టిన కృష్ణ భగవాన్ బృందావన్ బాబా ఎపిసోడ్ ఆడియన్స్ కి తెగ చిరాకు తెప్పిస్తుంది. అసలు కథా ప్రకారం ఈ ఎపిసోడ్ అవరసమే లేదు. మొదటి నుంచి హీర్ప్ఓ పాత్రని పవర్ఫుల్ గా రాసుకున్న డైరెక్టర్ సెకండాఫ్ కి వచ్చే సరికి మరీ సింపుల్ చేసేసాడు. రాసుకున్న పాత్రని సెకండాఫ్ లో క్యారీ చేయలేకపోయాడు. అలాగే సెకండాఫ్ లో నెరేషన్ చాలా స్లోగా ఉండడం మరియు మరీ ఊహాజనితమైన క్లైమాక్స్ ఆడియన్స్ కి మొదట్లో సినిమాపై కలిగిన ఫీల్ ని పూర్తిగా పోగొడుతుంది. ఓవరాల్ గా సినిమాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ చాలా తక్కువ.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు డిపార్ట్మెంట్స్.. అవే మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. మణిశర్మ అందించిన సాంగ్స్ బాగున్నాయి, అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఇచ్చిన లోకేషన్స్ ని బాగా చూపించాడు. ప్రవీణ్ పూడి ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ గుడ్, కానీ సెకండాఫ్ మాత్రం చాలా కట్ చేయాల్సింది. యాక్షన్ ఎపిసోడ్స్ ని బాగా షూట్ చేసారు.

ఈ సినిమాకి కథ – కథనం – మాటలు – దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది జగదీష్.. కథ – జగదీష్ రెగ్యులర్ కథని కొన్ని మంచి పాయింట్స్ తో రాసుకున్నాడు, కానీ అవి కేవలం ఫస్ట్ హాఫ్ కే పరిమితం అవ్వడం మైనస్. కథనం – ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండాఫ్ వరస్ట్. మాటలు – బాగున్నాయి, ముఖ్యంగా హీరోకి, చలపతి రాకీ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. దర్శకత్వం – దర్శకుడిగా అనుకున్న కొన్నిటిని ఆన్ స్క్రీన్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు కానీ ఒక మంచి సినిమా ఇచ్చి ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. సీతారామరాజు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

యంగ్ యాక్టర్ సత్య కార్తీక్ ని మొదటి సినిమా ప్రెజంటేషన్ విషయంలో ‘టిప్పు’ సినిమా పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇక సినిమా విషయానికి వస్తే మంచి కథని సరిగా తీయలేకపోయారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే సగం ఉడికిన అన్నంలా తయారు చేసారు. టిప్పు సినిమాకి ఫస్ట్ హాఫ్ ఎంత పెద్ద హెల్ప్ అయ్యిందో సెకండాఫ్ అంత మైనస్ అయ్యింది. సెకండాఫ్ పైన డైరెక్టర్ జగదీష్ ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే సత్య కార్తీక్ కి ఓ మంచి డెబ్యూ మూవీ అయ్యేది. సత్య కార్తీక్ పరంగా చూసుకుంటే ఒక న్యూ హీరోగా తన 100% ఇచ్చి తనలో టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఓవరాల్ గా బ్లైండ్ అండ్ రొటీన్ రెగ్యులర్ మాస్ మసాలా కావాలనుకునే వారు ఈ సినిమాని చూడచ్చు.

Jio Rockers